సినిమా స్టార్స్ ఎప్పుడూ ఎంత సాధించినా తాము సాధించింది కొంతే అనుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు తప్పా చాలా మంది గొప్పలు చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. ఇక హీరోయిన్స్ అయితే మరీనూ..! అసలు తమకేం తెలీదన్నట్లే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదే కోవలో చేరింది టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..

Image result for rakul preet

          టాలీవుడ్ లో ఇప్పుడు రకుల్ ప్రీత్ హవా నడుస్తోంది. ఆమె పట్టిందల్లా బంగారమే.! వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తన ప్రస్థానం ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా జయజానకి నాయకలో నటించి మెప్పించింది. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమాలో కూడా రకుల్ ప్రీతే హీరోయిన్. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు రకుల్ ప్రీత్ హీరోయిన్ ఎంచుకుంటున్నారంటే ఆమె ఏ రేంజ్ కు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.

Image result for rakul preet

          అయితే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనుకుంటోంది రకుల్ ప్రీత్. విజయం వచ్చినప్పుడు మురిసిపోవడం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోవడం తనకు చేతకాదంటోందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. సినిమా హిట్ అయినప్పుడు దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలీదంట. పని చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటాను తప్ప జరిగిపోయినదాని గురించి ఎప్పుడూ ఆలోచించనని తేల్చిచెప్పింది రకుల్. సక్సెస్, ఫెయిల్యూర్ లపై కూడా తాను పట్టించుకోను అంటోందీ పంజాబీ భామ.! మంచి పాలసీ కదా..!!


మరింత సమాచారం తెలుసుకోండి: