తెలుగు ఇండస్ట్రీ కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే సమయానికి ఈ అల్లరోడు కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  గత మూడు సంవత్సరాలు గా ఒక్క ‘సుడిగాడు’ తప్ప ఏ సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదు.  దీంతో ఈ సారి ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు నరేష్.  

స్పూఫ్ కామెడీలతో ఆడియన్స్ ని నవ్వించాలని ప్రయత్నించినప్పటికీ, ఆ ఫార్ములా అంతగా వర్కవుట్ కాలేదు. అందుకే.. మలయాళంలో హిట్టయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ని తెలుగులో ‘మేడ మీద అబ్బాయి’ పేరుతో రీమేక్ చేసి కొత్తగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరి నరేష్.  డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడి చుట్టు ఏం జరిగిందీ అనే కథాంశం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.  కామెడీ పరంగా కాస్త ఓకే అనుకున్నా..సరైన కథాబలం లేక పోవడంతో సినిమా తేలిపోయింది.  
Image result for meda meeda abbayi stills
ఒక రకంగా చెప్పాలంటే..అల్లరి నరేష్ కు గతకొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  అల్లరి నరేష్ కు హిట్ లేక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పైనే అవుతోంది.  మేడమీద అబ్బాయి చిత్రం ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ లు సోషల్ మీడియాలో బాగానే అలరించాయి.  
Image result for meda meeda abbayi stills
ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది..ఇక అల్లరి నరేష్ ‘బిగ్ బాస్’ షో కి వెళ్లి సందడి చేశాడు. ఇలా ఎన్నో రకాలుగా తన సినిమా కోసం ప్రమోషన్ లో పాల్గొన్నాడు నరేష్. హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అల్లరి నరేష్ కుదేలయ్యాడు పాపం .


మరింత సమాచారం తెలుసుకోండి: