ఈ మద్య తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీల వరుసగా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి.   ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కవి సి.నారాయణరెడ్డి, రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  కన్నడ న‌టుడు, నిర్మాత ఆర్ ఎన్ సుద‌ర్శ‌న్ (78)  అనారోగ్యం కార‌ణంగా క‌న్నుమూశారు.  తాజాగా ప్రముఖ కన్నడ నటి బివి రాధ (70) ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు . 70 ఏళ్ల వయసున్న రాధ కెరీర్ తొలినాళ్ళ లో కన్నడ చిత్ర పరిశ్రమలో రాణించింది.
Image result for కన్నడ సీనియర్ నటులు
దాదాపు 300 చిత్రాల్లో పలు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  బివి రాధ కన్నడంలోనే కాకుండా తెలుగు , తమిళ , భాషలలో కూడా నటించింది.  కన్నడ దర్శకుడు కే ఎస్ ఎల్ స్వామి ని పెళ్లి చేసుకున్నారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బివి రాధ బెంగుళూర్ లోని తన కూతురు ధనలక్ష్మి ఇంట్లో ఉంటోంది.  కాగా, 1964లో ‘నవకోటి నారాయణ’ అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.
Image result for bv radha kannada actress
తెలుగులో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి నటించిన ఆమె, పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  ఆరోగ్యం మరీ శృతి మించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో సడెన్ గా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు . కన్నడంలో పలు చిత్రాలను నిర్మించింది నటి బివి రాధ . సీనియర్ నటి మృతి చెందింది అన్న వార్త దావానలంలా వ్యాపించడం తో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: