‘అ ఆ’ సినిమాలో సమంతకు అసిస్టెంట్ గా నటించిన హరితేజ ఆ తరువాత ‘బిగ్ బాస్’ పుణ్యమా అని ప్రస్తుతం బుల్లితెర సెలెబ్రెటీగా మారిపోయింది. ‘బిగ్ బాస్’ షోకు సంబంధించి స్ట్రాంగ్ విన్నర్ గా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న హరితేజ క్రేజ్ ను హీరో సునీల్ వాడుకుంటూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ వారం విడుదల కాబోతున్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా విజయం ప్రస్తుతం పరాజయాల బాటలో పయనిస్తున్న సునీల్ కు అత్యంత కీలకం కావడంతో సునీల్ ‘బిగ్ బాస్’ షోకు ఈవారం అతిధిగా వెళ్ళి అక్కడ సందడి చేయబోతున్నాడు. దీనికోసం సునీల్ పూణే వెళుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఆశ్చర్యకరంగా ఈసినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న హరితేజాకు ‘ఉంగరాల రాంబాబు’ ఈవారం విడుదల అవుతున్నట్లు కూడ తెలియదు. అయితే సునీల్ ఈసినిమా ప్రమోషన్ కోసం ‘బిగ్ బాస్’ షోకు వెళ్ళడమే కాకుండా అక్కడ హరితేజా తో కొన్ని కామెడీ టాస్క్ లు కూడ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా సునీల్ మరో వారంలో విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’ మ్యానియాను లెక్క చేయకుండా కేవలం మిగిలి ఉన్న ఒకే ఒక్క వారాన్ని నమ్ముకుని ‘ఉంగరాల రాంబాబు’ కు ఎంత ప్రమోట్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆతరువాత మరొక వారం గ్యాప్ తో ‘స్పైడర్’ వస్తున్న నేపధ్యంలో జూనియర్ మహేష్ ల సినిమాల కోసం సునీల్ సినిమాను ఎత్తేసే ఆస్కారం ఉంది అన్న విశ్లేషణలు కూడ వినిపిస్తున్నాయి. ఏమైనా నడుస్తున్న కాలం సునీల్ కు ఏమాత్రం కలిసి వస్తున్నట్లుగా అనిపించడం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: