అస్త‌మానూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా అప్పుడ‌ప్పుడూ కొత్త‌దారిలో కొన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌డం నాగార్జున‌కు అల‌వాటు. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు అని చెప్ప‌లేం గానీ, త‌న అభిరుచికి త‌గిన సినిమాలు తీసుకొంటారాయ‌న‌. గ‌గ‌నం, రాజ‌న్న అలాంటివే. అయితే ఆ త‌ర‌హా సినిమాలు ఇక చేయ‌ను గాక చేయ‌ను అంటున్నాడు నాగ్‌. ``సినిమాకి వ‌చ్చేది హాయిగా ఎంజాయ్ చేయ‌డానికి సందేశాలు విన‌డానికి కాదు. సినిమా అంతా సీరియ‌స్ నెస్ ఉంటే జనం చూడ‌డం లేదు. స‌మాంత‌ర చిత్రాల‌కు ఇవి రోజులు కావు. ఇక నుంచి అలాంటి సినిమాలు చేయ‌ను. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే మేలు`` అంటున్నాడు నాగ్‌. ఇన్నాళ్ల‌కు నాగ్ భాయ్‌కి జ్ఞానోదయం అయ్యింద‌న్న‌మాట‌. నాగ్ లాంటివాళ్లే ఇలా అంటే ఇక అలాంటి సినిమాలు తీసేదెవ‌రు??

మరింత సమాచారం తెలుసుకోండి: