ప‌వ‌న్ మానియా ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. రోజుకో హీరో ఐయామ్ ప‌వ‌న్ ఫ్యాన్ అని చెప్పుకొంటున్నాడు. నితిన్ ఎప్ప‌టినుంచో ప‌వ‌న్ నామజ‌పం చేస్తున్నాడు. మొన్న మంచు మనోజ్ కూడా ప‌వ‌ర్ స్టార్ గురించి పాజిటివ్ ముక్క‌లు మాట్లాడాడు. ఇప్పుడు ఈ జాబితాలో నిఖిల్ కూడా చేరిపోయాడు. ``ర‌జ‌నీకాంత్‌, ప‌వ‌న్ కల్యాణ్ ఇద్దరూ ఇద్దరే. వాళ్లు సాధించిన విజ‌యాల‌కు ఇంత ఫాలోయింగ్ ఉందంటే న‌మ్మ‌లేం. వారిలో ఏదో మ్యాజిక్ ఉంది. అదే.. వారిని గొప్ప‌వాళ్లగా మార్చింది..`` అంటూ ట్విట్ట‌ర్లో సందేశం పంపాడు. ప‌వ‌న్‌లో అంత‌గా న‌చ్చింది... ఆయ‌న వ్య‌క్తిత్వ‌మేన‌ట‌. అంద‌రూ ఫిదా అయిపోయింది దానికోస‌మే క‌దా? ఇంకెంత మంది హీరోలు ప‌వన్ పార్టీలో చేర‌తారో??

మరింత సమాచారం తెలుసుకోండి: