తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య అప్ కమింగ్ హీరోయిన్లు రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా ఇప్పటికే మంచి ఫామ్ లో ఉండగా కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తెలుగు లో తమ సత్తా చాటుతున్నారు. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉంటుంది.
Image result for supreme movie
ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా ‘సుప్రీమ్’ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటిస్తున్న రాశీఖన్నా ఈ మద్య కాస్త స్లిమ్ గా మారిపోయింది. ఈ అమ్మడు ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' .. రవితేజతో 'టచ్ చేసి చూడు' .. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల్లో ఆమె అవకాశాలను అందుకోగలిగింది. అంతే కాదు తమిళ, మళియాళ ఇండస్ట్రీలోకి కూడా ఒకటీ రెండు సినిమాలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంత బిజీగా ఉన్న రాశీ ఖన్నా తనకు మంచి హిట్ సినిమా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి కోసం పెద్ద సాహసమే చేస్తుంది.
Image result for rashi khanna hot
మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే ఫేస్ బుక్ ద్వారా స్వయంగా తెలియజేసింది. రాశీఖన్నాను తన చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించాలని కోరగా వెంటనే ఒప్పేసుకుందట..మరి గెస్ట్ గానే రాబోతుందా..లేక ఐటమ్ సాంగ్ లో అలరించ బోతుందా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్. తాను తెరపై కనిపించేది కాసేపే అయినా, ఆ ప్రభావం ఆడియన్స్ పై బాగానే ఉంటుందని చెబుతోంది. అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: