తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో సాగుతున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. హాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో భారత దేశంలో మొదటి సారిగా బాలీవుడ్ లోకి తీసుకు వచ్చారు. బిగ్ బాస్ షో కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక తమిళ, కన్నడ భాషల్లో కమల్ హాసన్, కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొట్టమొదటి సారిగా బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.    

బిగ్ బాస్ లోకి తాప్సీ ఎంట్రీ..?!
ఇప్పటికే అక్కడ పది సీజన్లు పూర్తి చేసుకుంది. 14 మంది కన్టెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ జర్నీ 66 ఎపిసోడ్ ఎపిసోడ్‌కి వచ్చేసరికి టైటిల్ రేస్‌లో ఐదుగురు మాత్రమే మిగిలారు.  బిగ్ బాస్ మొదటి, రెండవ వారం కాస్త చప్పగా సాగినా..తర్వాత ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండటం..శని, ఆది వారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడి ఈ షో పై కాస్త ఆసక్తి రేకెత్తించింది.  అంతే కాదు బిగ్ బాస్ కంటెస్టంట్స్ కి ఇస్తున్న టాస్క్ లు కూడా చాలా ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది.  

బిగ్ బాస్ లోకి తాప్సీ ఎంట్రీ..?!
మరోవైపు బిగ్ బాస్ హౌజ్ లోకి ఈ మద్య సెలబ్రెటీల ఎంట్రీ కూడా మంచి వినోదాన్ని అందిస్తుంది.  ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి చిత్రం ప్రమోషన్ కోసం రానా ఎంట్రీ ఇవ్వగా ఆనందో బ్రహ్మ చిత్రం కోసం తాప్సీ ఎంట్రీ ఇచ్చింది.  ఇక అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ కోసం దేవరకొండ విజయ్, మేడమీద అబ్బాయి కోసం అల్లరి నరేష్, ఉంగరాల రాంబాబు కోసం సునీల్ వచ్చి బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేశారు.   మొన్నటి ఆదివారం బిగ్ బాస్ హౌజ్ నుంచి దీక్ష పంత్ ఎలిమినేట్ అయ్యింది.  అయితే సోమవారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో ఉండే ఐదుగురు సభ్యులకు ఇక ఎలిమినేషన్ ఉండదు.  

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ నలభీముడిగా విశ్వరూపం చూపించాడు..!
నవదీప్, హరితేజ, అర్చన, ఆదర్శ్‌, శివబాలాజీ లలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ ఫైన్ విన్నర్ అవుతారు.  అది కూడా ఆడియన్స్ వేసే ఓట్ల ప్రకారం మాత్రం జరుగుతుంది.  సోమవారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో సభ్యుల్లో పెద్దగా సందడి కనిపించడం లేదు. ఫైనల్ పోరులో మిగతా ఎపిసోడ్‌లు మరింత రంజుగా ఉండబోతున్నాయని భావించిన ఆడియన్స్‌కు నిరాశే ఎదురైంది.

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ నలభీముడిగా విశ్వరూపం చూపించాడు..!
మిగతా ఎపిసోడ్‌నుండి కూడా ఎక్కువగా ఎక్స్‌పర్ట్ చేయొద్దని చెప్పకనే చెప్తున్నారు కన్టెస్టెంట్స్.  నిన్న ఒక్కొక్కర్ని సీక్రెట్ రూంకి పిలిచిన బిగ్‌బాస్.. ఈ 66 రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లో వారి జర్నీ ఏవిధంగా సాగిందనే దానిపై ఒక వీడియోను ప్లే చేసి, వారు హౌస్‌లో చేసిన తప్పొప్పులను గుర్తు చేశారు బిగ్ బాస్. ఇలా జరిగిపోయిన 65 ఎపిసోడ్‌లను ఫార్వర్డ్ చేసి  చూపించారు.  

అసలే నీరసంగా సాగుతున్న ఎపిసోడ్ లో చూసిందే చూపించడంతో పరమ బోర్ గా ఫీల్ అయ్యారు ఆడియన్స్. కాకపోతే..  ఇప్పటి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో కోపిష్ఠిగా ఉంటూనే ​ ప్రేక్షకుల హృదయాలను గెలిచుకున్న శివబాలాజీ తన వీడియోని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులు ఎమోషన్ ఫీల్ అయ్యేట్టు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: