ప్ర‌స్తుతం రామ‌య్యా వ‌స్తావ‌య్యా షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లో ఉంటోంది స‌మంత‌. వ‌ర్షాకాలం కాదా..?  అమ్మాయిలు కుదురుగా కూర్చోరు. చినుకుల్లో త‌డ‌వాల‌ని, లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాల‌ని ఉంటుంది. స‌మంత‌కూ అలాంటి చిలిపి కోరిక‌లున్నాయి. అందుకే ఆర్య‌తో హైద‌రాబాద్ రోడ్ల‌పై వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు బైక్ మీద ర‌య్ ర‌య్ అంటూ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇంత‌కీ ఆర్య ఎవ‌రు??  అంటారా..? స‌మంత అసిస్టెంట్ అట‌. ఈ వ్య‌వ‌హారాన్ని స‌మంత ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చింది. స‌మంత ట్విట్ చూడ‌గానే... ఈ ఆర్య ఎవ‌రు.? అంటూ జ‌నాలు ఆ పేరుపై ఫోక‌స్ చేశారు. ఎంత చేసినా.. క్లూ దొర‌కలేదు. మ‌రి సిద్దూకైనా ఈ ఆర్య సంగ‌తి తెలుసో లేదో??

మరింత సమాచారం తెలుసుకోండి: