7/G బృందావ‌న కాల‌నీ సినిమాతో ఆక‌ట్టుకొంది సోనియా అగ‌ర్వాల్. అయితే ఆ సినిమా ఆమెకు ఆశించిన‌న్ని అవ‌కాశాలు తీసుకురాలేదు. త‌మిళంలో మాత్రం కొన్ని సినిమాలు చేసింది. దర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్‌ని పెళ్లి చేసుకొన్న త‌ర‌వాత సినిమాల‌కు దూర‌మైంది. ఆమ‌ధ్య సెల్వ‌తో విడాకులు తీసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. ఇప్పుడు సినిమాల్లో అవ‌కాశాల కోసం అన్వేషిస్తోంది.

ఇప్పుడు  ఓ తెలుగు సినిమాలో ఐటెమ్ గాళ్ అవ‌తారం ఎత్తింది. అదేదో పెద్ద సినిమా కూడా కాదాయే. అమ్మానాన్న ఊరెళితే అనే ఓ చిన్న సినిమా. స‌వ్యంగా క‌థానాయిగా అవ‌కాశాలొస్తున్న‌ప్పుడు పెళ్లి చేసుకొని సైడ్ అయిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ విజృంభిద్దామ‌నుకొంటే ఇలాంటి ఛాన్స్‌లే వ‌స్తాయి. సోనియా.. ఇవ‌న్నీ నీకు అవ‌స‌ర‌మా??

మరింత సమాచారం తెలుసుకోండి: