బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది.  ఇక ఇలాంటి చిత్రాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడి మరీ నటిస్తున్నారు.  ఇలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. ఈ అమ్మడి పేరు సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది.  తన మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ, భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే, న్యూడ్ ఫోటోలు దిగి కానుకగా పంపిస్తానని అప్పట్లో సంచలన ప్రకటనే చేసింది.  
Related image
సంవత్సరంలో వచ్చే ప్రతి ఈవెంట్ కి తనదైన హాట్ వీడియోలు, ఫోటోలు ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా పోస్ట్ చేస్తుంది.  ఆ మద్య తెలుగు లో కూడా ఓ చిత్రంలో నటించిన పూనం పాండే తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పింది.    తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా చేస్తానని చెబుతోంది.
Image result for poonam pandey
గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన పూనమ్ పాండే, తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా? అని గడుసుగా చెబుతోంది.  
Image result for poonam pandey
తనకు ఏ హీరోయిన్ పోటీ కాదని..తన అందాలు ఆరాదించే వారు అభిమానించే వారు చాలా మంది ఉన్నారని అంటుంది.  అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది. వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని పూనమ్ చెబుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: