తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగుని అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి.  స్టూడెంట్ నెం.1 చిత్రంతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం 600 కోట్లు వసూళు చేయడంతో పాటు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది.  
Image result for baahuali 2
ఇక బాహుబలి 2 చిత్రం ఏకంగా ప్రపంచ స్థాయిలో దుమ్ముదులపడమే కాదు..భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా మిగిలిపోయింది.  బాహుబలి 2 చిత్రం తర్వాత రాజమౌళి ఏ చిత్రం తీస్తున్నారు..ఎవరూ హీరో అన్న విషయం మాత్రం వెల్లడించలేదు.  కాకపోతే గత కొంత కాలంగా రాజమౌళి ‘మహాభారతం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
Image result for baahuali 2
తాజాగా దీనిపై స్పందించిన జక్కన్న ‘మహాభారతం' సినిమాను తాను తీయడం లేదని స్పష్టం చేశారు.  'మహాభారతం' సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తాను 'బాహుబలి 2' విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు.  
Related image
మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది తన కల అని మాత్రమే చెప్పానే తప్ప, సినిమా తీస్తానని చెప్పలేదని ఆయన స్పష్టం చేషశారు. కొంతకాలం తరువాత తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభిస్తానని రాజమౌళి చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: