ఈ మద్య భారత దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న మృగాళ్లు విపరీతంగా తయారయ్యారని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  అయితే లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా జరుగుతున్నాయని ఇప్పటికే పలు సంఘటనలు రుజువు చేశాయి. 
Related image
ఆ మద్య మళియాళ నటి భావనపై ఆమె కారు డ్రైవర్ మరొ వ్యక్తితో లైంగిక వేధింపులకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం..నింధితున్ని అరెస్టు చేయడం జరిగింది.  ఇలా కొంత మంది నటీమణులు ఇండస్ట్రీలో తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తాజాగా ఓ నటిని కొంత మంది తాగుబోతులు వేధించడమే కాకుండా ఘోరంగా అవమానించారట.   
Image result for actress kanchana moitra molested at kolkata
వివరాల్లోకి వెళితే..బెంగాలీ నటి కాంచనా మొయిత్రా తన షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో కొంత మంది తాగుబోతులు ఆమె కారును ఆపి డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్తున్నాడని...తమపై కారును పోనించేందుకు ప్రయత్నించారని ఆరోపించి డ్రైవర్‌పై దాడి చేసి కారు కీస్‌ లాక్కొన్నారని ఆమె తెలిపింది.  ముగ్గురు యువకులు తాగిన మైకంలో ఉన్నారని..తనను కారులో నుంచి కిందకు దింపి అవమానంగా మాట్లాడి..తాకరాని చోట తాకుతూ లైంగికంగా నరకం చూపించారని బాధపడింది. 

అంతే కాదు ‘నేను డ్రైవర్‌ను 20సార్లు చెంపదెబ్బలు కొట్టాలని, ఆ తర్వాత నన్ను డ్రైవర్‌ 20సార్లు చెంపదెబ్బలు కొట్టాలని.. అప్పుడే కీస్‌ ఇస్తామని వేధించారు. 40సార్లు సిట్‌-అప్‌లు చేయాలని నన్ను బెదిరించారు’ అని ఆమె తెలిపింది.  ఈ ఘటనకు సంబంధించి బెహలా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవ్వగా..ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన తర్వాత తాను చాలా రోజుల వరకు మానసికంగా బాధపడ్డానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచనా మొయిత్రా.  తెలిపింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: