ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా సినిమా స్పైడర్. ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. ఎ.ఆర్. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.

Image result for spyder stills

 స్పైడర్ ఫస్ట్ డే రూ.51 కోట్లు వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రావడంతో యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఓవర్సీస్ ప్రీమియర్ షోలలో మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన సినిమా.. మొదటి రోజు రూ.51 కోట్లు వసూలు చేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రిన్స్ అభిమానులు.

Related image

 మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మించారు. ఎన్.వి.ఆర్. సినిమా సారథ్యంలో రూపొందిన స్పైడర్ .. మరిన్ని సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని బాక్సాఫీస్ వర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: