ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటులు టామ్ ఆల్టర్ (67) కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆయన స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు..తర్వాత కోలుకున్న ఆయన ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైన టామ్.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 
బాలీవుడ్ నటుడు టామ్ కన్నుమూత
అమెరికా సంతతికి చెందిన టామ్‌ ఆల్టర్‌ ఇండియా షోబిజ్‌ టీవీ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న టామ్‌ఆల్టర్‌ పలు బాలీవుడ్‌ చిత్రాల్లో, టీవీ సిరీస్‌ ప్రోగ్రామ్‌లో నటించారు.
Image result for ACTOR tomalteR
300 సినిమాల్లో నటించిన టామ్.. ఇండియా షోబిజ్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆషికీ, రామ్ తేరి గంగా మైలీ చిత్రాలతో పాటు పాపులర్ శక్తిమాన్ సీరియల్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టామ్ ఆల్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: