రాంచరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా చిరంజీవి కోరినట్టుగానే వాయిదా పడింది. ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆయన బర్థ్ డేకు ఒక రోజు ముంది అంటే ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. శనివారం రాత్రి ఆయన మీడియాకు ఈ విషయం వెల్లడించారు. అయితే వాయిదాకు స్పష్టమైన కారణాలు మాత్రం ఆయన వివరించలేదు కాని సినిమా కాస్థా ప్రమాదంలో ఉందన్న  భావనను వ్యక్థం చేసాడు. భారి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ పై దిల్ రాజుకు బెంగ పట్టుకుందన్న భావం ఆయన మాటల్లో వ్యక్థమయింది అన్న మాటలు టాలీవుడ్ లో వినిపిస్థున్నాయి.

కారణం తెలంగాణపై కాంగ్రేస్ అధిష్టానం ఆగస్టు 2న నిర్ణయం వెలుబడనుందట. ఈ విషయం స్వయాన కేంద్రమంత్రి అయిన చిరంజీవికి ఎలాగు తెలుస్థుంది కదా, అందుకే ఆయన ఇప్పటికే ‘ఎవడు’ నిర్మాతలను పిలిపించుకుని చూచాయగా సినిమా వాయిదా వేయడంపై చర్చించాడని కూడా వార్థలు వెలుబడ్డాయి.

అయితే రాష్ట్ర విభజన అంశంపై నిజాలు తెలిసిన చిరంజీవి ఈనెల 31 న విడుదల సేఫ్ కాదని, ఆగస్టు రెండున తెలంగాణ నిర్ణయం, ఆతరువాత ఏర్పడ్డ పరిస్థితులు సద్దుమనగాడినికి పట్టే పరిస్థితులను పరిశీలించి ‘ఎవడు’ సినిమా విడుదల తేదీని చిరంజీవే స్వయంగా ఆగస్టు 21 గా నిర్ణయించి ఖరారు చేసాడని కూడా పుకార్లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: