పాపం మహేష్.. ప్రయోగాలు చేస్తున్న ప్రతిసారీ దెబ్బతింటున్నాడు. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాల‌తో ఇటీవ‌ల కాలంలో వ‌రుస దెబ్బ‌లు తిన్న మ‌హేష్ ఇప్పుడు లేటెస్ట్‌గా స్పైడ‌ర్ లాంటి విభిన్న‌మైన సినిమా చేసి మ‌రోసారి దెబ్బ‌తిన్నాడు. స్పైడ‌ర్‌తో త‌మిళ్‌లో కూడా గ్రాండ్‌గా లాంచ్ అయిన మ‌హేష్ స్పైడ‌ర్‌తో బిగ్ హిట్ కొట్టాల‌ని బొక్క బోర్లా ప‌డ్డాడు. 

spyder movie కోసం చిత్ర ఫలితం

స్పైడ‌ర్‌ ఆల్రెడీ నెగెటివ్ టాక్ ప్రభావం పీకల్లోతు వుంటే.. మరోవైపు ‘జై లవకుశ’, ‘మహానుభావుడు’ చిత్రాలు ఎడాపెడా వాయించేస్తున్నాయి. దీంతో.. ఈ సూపర్‌స్టార్ డీసెంట్ కలెక్షన్లతోనే సరిపెట్టుకుంటున్నాడు. ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం ఈ సినిమా తొలి 4 రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.21 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. 


వాస్త‌వంగా చూస్తే ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వులు ఉన్నాయి. ఇంకా స్కూళ్లు తెర‌వ‌లేదు. వర్కింగ్ డేస్‌లోనే స్టార్ హీరోల సినిమాలు 4-5 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తాయి. ఇందుకు భిన్నంగా స్పైడ‌ర్ సెల‌వుల్లోను అంత‌కుమించి చాలా త‌క్కువే వ‌సూలు చేస్తోంది. సినిమాలో కంటెంట్ డిఫ‌రెంట్‌గా ఉన్నా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో స్పైడ‌ర్ ఘోర‌మైన రిజల్ట్ చూడాల్సి వ‌చ్చింది. 

spyder movie కోసం చిత్ర ఫలితం

స్పైడ‌ర్ 4 డేస్ ఏరియా వైజ్ కలెక్ష‌న్స్ :  (కోట్లలో)
నైజాం : 7.53
సీడెడ్ : 3.65
ఉత్తరాంధ్ర : 3.01
గుంటూరు : 3.06
ఈస్ట్ గోదావరి : 3.18
వెస్ట్ గోదావరి : 2.40
కృష్ణా : 1.89
నెల్లూరు : 1.49
----------------------------------------------------------
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.26.21 కోట్లు (షేర్)
----------------------------------------------------------

spyder movie కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: