తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు.  రమేష్ బాబు కొంత కాలానికి నిర్మాతగా మారగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో రేస్ లో ఉన్నారు.   ఓ వైపు యాడ్స్ లో నటిస్తూనే సినిమాల్లో తన సత్తా చాటుతున్నారు.  ఈ మద్య తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ఆ మద్య శ్రీమంతుడు చిత్రంతో దుమ్మురేపారు.
Image result for spyder movie stills
తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది.  ఇక తెలుగు లో డివైడ్ టాక్ రావడం..కలెక్షన్ల పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాగానే నడుస్తుంది.  ఇక కలెక్షన్ల పరంగా ఢోకా ఏమీ ఉండదనుకుంటున్న సందర్భంలో  ‘స్పైడర్’కు ఎదురు దెబ్బ తగిలింది. 
Image result
స్పైడర్ సినిమా  బాగా నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం విధించే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి తోడు తమిళనాడు ప్రభుత్వం కూడా అదనంగా పది శాతం దాకా వినోదపు పన్ను వేస్తుండటాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్రంలోని మల్టీప్లెక్సులు స్ట్రైక్ చేస్తున్నాయి. కొన్ని మల్టీప్లెక్సులు నడుస్తున్నప్పటికీ.. కొన్ని మాత్రం షోలు ఆపేశాయి.  దీంతో స్పైడర్ కలెక్షన్ల పరంగా భారీగా నష్టాలు రావొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘స్పైడర్’కు పోటీగా దసరా సీజన్లో విడుదలైన తమిళ సినిమా ‘కరుప్పన్’ రూరల్ మూవీ. అది సింగిల్ స్క్రీన్లలో బాగా ఆడుతుండగా.. మల్టీప్లెక్సుల్లో ‘స్పైడర్’ ఆధిపత్యం చలాయిస్తోంది. 
Image result for tamil spyder movie stills
 ప్రస్తుతం దేశం మొత్తంలో సినిమాలపై అత్యధిక పన్ను పడుతున్న రాష్ట్రం తమిళనాడే అని అంటున్నారు అక్కడి విశ్లేషకులు. తమిళనాట టికెట్ల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి.  దీంతో సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కోలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  మొత్తానికి మహేష్ నటించిన ‘స్పైడర్ ’ సినిమాకు మొదటి నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: