ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో అలరించగా ఆ తర్వాత వచ్చిన ఒక లైలా కోసం సినిమాలో కూడా ఇంప్రెస్ చేసింది. బాలీవుడ్ లో మొహెంజోదారో ఆఫర్ వచ్చినా అది ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడు మళ్లీ టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది. బన్ని డిజెలో అందాలతో ఆడియెన్స్ ను అలరించిన అమ్మడు ఇన్నాళ్లు ఈ లాజిక్ మిస్ అయ్యిందట.


తన సొగసులను ఎరగా వేస్తూ ఈమధ్య అమ్మడు ఫోటో షూట్స్ కూడా క్రేజీగా మారాయి. ఇక ప్రస్తుతం అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తుంది. తన సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని బెల్లంకొండ బాబు ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న పూజా హెగ్దెతో రొమాన్స్ చేస్తున్నాడు.


అంతేకాదు డిజెలో కన్నా ఇందులో అమ్మడు మరింత హాట్ గా కనిపించబోతుందట. సినిమాలో పూజా అందాలను ఫుల్ గా వాడేస్తున్నారని టాక్. ఎలాగు ఇలా ఉంటేనే తనకు డిమాండ్ ఉంటుందని అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పట్లేదట. మొత్తానికి బెల్లంకొండ బాబుతో పూజా రొమాన్స్ పీక్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. 


ఇక సినిమాలో పూజా అందాలనే హైలెట్ చేస్తూ వస్తున్నారట. డిజె సక్సెస్ తో కాస్త మైలేజ్ ఏర్పరచుకున్న అమ్మడు ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న అమ్మడు సినిమాలో అంతకుమించి అందాలను గుమ్మరించేసిందట. ప్రస్తుతం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవనుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: