ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నారు. తెలుగు లో వరుసగా దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆనారోగ్యంతో కన్నుముశారు.  ఇక  మాస్ మహరాజ రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నారు. 
Image result for కన్నడ హీరో రాకేష్
తాజాగా బాల నటుడిగా రంగ ప్రవేశం చేసి, ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కన్నడ యువ నటుడు రాకేశ్ (27) కన్నుమూశాడు. శాండల్ వుడ్ అభిమానులు 'బుల్లీ' అని ప్రేమతో పిలుచుకునే రాకేశ్, కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆశారాణి - నాగేష్ అనే దంపతుల ముద్దుల కుమారుడు ఈ రాకేష్ . తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటీనటులు కావడంతో వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి వచ్చాడు రాకేష్ .

కొంతకాలంగా గ్యాంగ్రిన్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కోరమంగళ్‌లోని సెయింట్ జాన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.  ఆయనకు రెండు నెలల క్రితం ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల వ్యాధి తిరిగి ముదరడంతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

రాకేష్ హీరోగా నటించిన '' ధూమపాన '' అనే చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.రాకేశ్ మృతి పట్ల శాండల్ వుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: