ఈ మాట అంటుంది ఎవరో కాదు అక్కినేని నాగచైతన్య..ఎందో తెలుస్తే షాక్ కావాల్సిందే మరి.  ప్రస్తుతం అక్కినేని నాగార్జున యాంకర్, డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో నాగ్ తో పాటు ఆయనకు కాబోయే కోడలు ప్రముఖ నటి సమంత కూడా నటించింది.  ఈ నెల 6 అక్కినేని నాగ చైతన్య, నటి సమంత వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. 
Image result for raju gari gadhi 2
గోవాలో జరగనున్న ఈ వేడుకకు అన్నీ కార్యక్రమాలు చక చకా సాగిపోతున్నాయి.  అక్కినేని నాగార్జున తన తనయులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా తన పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్యకు ఓ సినిమా చూడొద్దని సలహా ఇచ్చాడట.  ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా..! నాగ్, సమంత నటించిన ‘రాజుగారి గది 2’. 
Image result for naga chaitanya
సమంత ఆత్మగా నటించిన రాజుగారి గది 2 చిత్రం చూసావంటే సమంత తో కలిసి ఒకే గదిలో పడుకోలేవు అంతగా భయపెడుతుంది అని నాగచైతన్య కు సలహా ఇచ్చాడట.  దీంతో ఖంగు తిన్న చైతూ..ఓ వైపు తండ్రి మరోవైపు సీనియర్ నటుడే అంతటి మాట అన్నాడంటే..సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని నేను అస్సలు రాజుగారి గది 2 చూడనని చెప్పాడట నాగచైతన్య.   
Related image
రాజుగారి గది 2 లో సమంత దెయ్యంగా నటించిందట..ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఈ అమ్మడు భయపెట్టే తీరు చూస్తే నిజంగా థియేటర్లో వెన్ను పూసల్లో వణుకు వస్తుందని అందుకే..ఆ సినిమా చూడకు ఎందుకంటే సమంత ని పెళ్లి చేసుకుంటున్నావ్ కాబట్టి , ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాలి కాబట్టి ఆ సినిమా చూస్తే సమంత తో కలిసి ఉండలేవని డైరెక్ట్ గా చెప్పాడట .
Related image
చైతూ కూడా రియలైజ్ అయి రాజుగారి గది 2 చూడనని చెప్పాడని నాగార్జున తెలిపాడు.  ఇది ఏంత వరకు నిజమో కానీ..సినిమా పై అప్పుడే ప్రమోషన్లు మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: