ఒక నెల రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ మీడియా నీ జనలనీ సినిమా వారినీ కుదిపేసింది డ్రగ్స్ కేసు . హాట్ హాట్ గా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు అందరూ దొరికిపోయారు అంటూ ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం నడిచింది. డ్రగ్స్ కేసు తో అనేక మంది ఆంధ్రా , తెలంగాణా సినిమా పెద్దలకి సంబంధాలు ఉన్నాయి అంటూ డైరెక్టర్ పూరీ దగ్గర నుంచీ రవితేజ , అతని కారు డ్రైవర్ ఇలా అందరి వరకూ కేసు నడిచింది.

ఒక్కొక్కరి దగ్గర నుంచీ సాంపిల్స్ తీసుకున్న సిట్ ప్రత్యెక బృందం ఇంకేంటి అందరినీ అరస్ట్ చేసేస్తున్నాం అన్నంత హడావిడి చేసినా ఆ తరవాత ఏమీ కనపడలేదు . డ్రగ్స్ కేసు లో ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ డ్రగ్స్ కేసు లో కదలిక వచ్చేలాగానే ఉంది పరిస్థితి.

ఈ కేసు విచారణ లో భాగంగా రక్త నమూనాలు , జుట్టు , గోళ్ళు లాంటివి ఇచ్చారు సెలెబ్రిటీ లు. కొంద‌రు స్వ‌చ్ఛందంగా న‌మూనాలు ఇస్తే, మ‌రికొంద‌రు నిరాక‌రించారు కూడా! అయితే, ఇలా సేక‌రించిన న‌మూనాల‌కు ఇంత‌వ‌ర‌కూ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డం విశేషం! సేక‌రించిన వాటిని అప్పుడే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు.

సాంపిల్స్ అన్నీ ల్యాబ్ లోనే ఉండిపోయాయి ఇప్పుడిప్పుడే వీటికి సంబంధించి నెమ్మదిగా విచారణ ముందరకి జరుగుతోంది అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ సాంపిల్స్ ని అసలు పరీక్ష కూడా చెయ్యలేదు అంటున్నారు. కార‌ణం ఏంటంటే… ఆ న‌మూనాల‌ను శాస్త్రీయంగా ప‌రీక్షించేందుకు కావాల్సిన ర‌సాయ‌నాలు అక్క‌డ లేవ‌ట‌ , విదేశాల నుంచీ దీనికి సంబందించిన రసాయనాలు తెప్పించుకోవడం కోసం దాదాపు రెండు నెలలు వేస్ట్ చేసారు అధికారులు అని మీడియా లో ఒక వర్గం గట్టిగా చెబుతోంది. నిందితుల నుంచి సేక‌రించిన న‌మూనాల ప‌రీక్ష‌ల‌కే ఇన్నాళ్లు టైం ప‌డితే… కేసు ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!


మరింత సమాచారం తెలుసుకోండి: