బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, డాన్సర్ హేమామాలిని నగలు చోరీ అయ్యింది.  హేమామాలిని వ్యక్తిగత సామాన్లు భద్రపరుచుకునే ఓ గోడౌన్ లో దొంగలు పడ్డారు. హేమామాలిని యుపిలోని మథుర నియోజకవర్గం నుంచి ఏంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో  గోరెగాంలోని తన ఇంట్లో రూ.90లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు, పనిమనిషి హత్తం వుందనే అనుమానాలున్నాయంటూ హేమామాలిని ఫిర్యాదు చేసారు.
Image result for hema malini dance
తన నృత్య ప్రదర్శనలకు వినియోగించే క్యాస్టూమ్స్, ఇమిటేషన్ నగలను అంథేరీలోని ఓ గోదాంలో దాచగా వాటిని ఎవరో దొంగిలించారని పిర్యాదు లో పేర్కొంది. వీటి విలువ దాదాపు 90 వేల రూపాయిల వరకు ఉంటుందని ఆమె తెలిపింది.కాగా.. పనిమనిషి నుంచి గత ఐదారు రోజులుగా ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడం, హేమ మేనేజర్ ముంబై అంధేరిలోని డి.ఎన్.నగర్ లో వున్న గొడౌన్ ను చూసి దొంగతనం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Image result for hema malini dance
నృత్య ప్రదర్శనకు వాడే క్యాస్టూమ్స్, ఇమిటేషన్ నగలు మంగళవారం ఈ చోరీ గురించి తెలిసిందని చెప్పారు.  ఈ కేసుకు సంబంధించి హేమ ఇంటి పనిమనిషిని అనుమానితునిగా భావించి అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు.ఈ ఘటనపై జూహు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ డి.బర్గుడే తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: