తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చి దాదాపు ముప్పయి సంవత్సరాలు అవుతుంది..మహానటులు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 1986 లో విక్రమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఆ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు..కానీ తర్వాత వచ్చిన మజ్ను, సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రికి తగ్గ తనయుడి అనిపించుకున్నాడు.  తర్వాత కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో మాస్ హీరోగా మెప్పించారు. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. 
Image result for raju gari gadhi 2 stills
ఇక  రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం ‘శివ’ తెలుగు ఇండస్ట్రీలో స్టైల్ నే మార్చేసింది. ఇండస్ట్రీలో నాగార్జునను మన్మథుడు, కింగ్ అని అభిమానులు పిల్చుకుంటారు. గత కొంత కాలంగా  మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో టాలీవుడ్ యంగ్‌  హీరోలకే పోటీ ఇచ్చిన నాగ్‌.. ప్రస్తుతం రాజు గారి గది 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 
Image result for raju gari gadhi 2 press meet
ఈ మద్య నాగార్జున్ కొత్త లుక్స్ తో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య, నటి సమంత ల వివాహం గోవాలో జరగబోతుంది.  ‘రాజు గారి గది 2’  సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగ్‌ సరికొత్త లుక్‌ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే నాగార్జున్ త్వరలో మహాభారతలో కర్ణుడు పాత్ర లో కనిపించ బోతున్నాడని..అందుకే ఆయన మీసాలు తీశారని..త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని రక రకాల వార్తలు వచ్చాయి.   

ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు నాగ్ దిమ్మతిరిగే నిజాలు చెప్పారు. వచ్చే మూడు నెలల్లో నాకు ఎలాంటి షూటింగ్‌లు లేకపోవడంతో కొత్తగా ఏదైనా చేద్దామని మీసాలు తీసేసినట్లు తెలిపారు.ఈ  కొత్త లుక్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని  చెప్పుకొచ్చాడు. ఇక  మొత్తానికి నాగ్‌ తన న్యూలుక్‌పై క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పడినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: