గౌరీ లంకేష్  హత్య కేసు లో ప్రధాని మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆయన ఒక గొప్ప నటుడు అంటూ ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ని కూడా అపహాస్యం చేసారు ప్రకాష్ రాజ్.


అయితే తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి అని ఎంతగా ప్రెజర్ పెట్టినా కూడా ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకూ తన మాటలు వెనక్కి తీసుకోలేదు, మోడీ మీద తనకి తగిన గౌరవం ఉంది అంటూ నే గౌరీ హత్య విషయం లో మాత్రం మోడీ సరిగ్గా ప్రవర్తించనేలేదు అనేది ప్రకాష్ రాజ్ సీరియస్ కామెంట్. ఆయన దేశమంతటికీ ప్రధాని గనుక కొన్ని విషయాల్లో తన వైఖరితో ఏకీభవించలేనని చెబుతున్నారు. అలాంటి  విషయాల్లో చేసిన విమర్శలు వెనక్కు తీసుకోబోనని తేల్చిచెప్పారు.


నోరు జారి ఎదో ఒకటి అనేసాను క్షమించండి అంటూ సమాధానాలు చెప్పేవారు బోలెడు మంది, ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో ఉన్నవారికి ఇది చాలా చిన్న మ్యాటర్. ఏదోటి అనడం సారీ చెప్పడం మళ్ళీ గుంపు లో గోవింద లాగా జీవితం లో కెరీర్ లో ముందరకి వెళ్ళిపోవడం లేదంటే తమా కెరీర్ కి భంగం కలిగే అవకాశం ఉంది అని కూడా భయపడతారు కొంతమంది.


కానీ ప్రకాశ్ర్ రాజ్ మాత్రం ఏ మూలా కూడా అలా ఫీల్ అవ్వకపోవడం ఆశ్చర్యకరం , అభినందనీయం.ఒకోసారి ఏదో మాట్లాడినా తర్వాత వెనక్కు తగ్గి వివరణలు ఇచ్చేవారిలా ఆయన ప్రవర్తించకపోవడం అభినందనీయమే కదా.. విమర్శలకే కేసులు పెడితే జరిగేదేమో జరుగుతుంది. కానీ వెనక్కి తగ్గి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తాము కోల్పోయేలా ప్రవర్తించలేదు ప్రకాష్ రాజ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: