గోవా లో నిరాడంబరంగా కేవలం 100 మంది సమక్షం లో ఒక్కటి అవ్వబోతున్నారు హీరో నాగ చైతన్య ఆమె ప్రేయసి సమంత . ఈ సందర్భంగా అక్కినేని - దగ్గుబాటి ఫ్యామిలీ కలిసి సమంత కి తమ కుటుంబంలోకి వెల్కం చెబుతూ ఒక చిన్న వీడియో చిత్రీకరణ చేసారు.


వివాహం జరుగుతున్న టైం లో దీన్ని ప్రసారం చేస్తారు . ఈ వీడియో గురించి సమంత కి గానీ చైతన్య కి కానీ అస్సలు తెలీదు. సమంత కి సర్ ప్రైజ్ కానుక గా ఈ వీడియో ని ఇవ్వాలని రెండు ఫ్యామిలీలూ చూస్తున్నాయి.


నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులంతా ఈ వీడియోలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్ గా ఉంటుందన్న నమ్మకంతో వీరంతా ఉన్నారట.


ఇవాళ రాత్రి గోవా లో వీరి పెళ్లి జరగబోతోంది. ఫ్యాన్స్ చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. ఎక్కువ మంది అభిమానులు, ఈ జంట తొలి చిత్రం 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. ఈ పెళ్లి మొత్తానికీ ఈ వీడియో నే హై లైట్ అంటున్నారు, ఈ ఐడియా అసలు అఖిల్ ది అట  తన వొదిన కోసం అఖిల్ ఈ ఏర్పాటు చేసాడు అని చేబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: