GST వచ్చిన రోజుల దగ్గర నుంచీ కాలీవుడ్ లో సినిమా వారు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. GST తమకి వద్దు అని చాలా మంది అప్పట్లో గొంతు విప్పినా ఇప్పుడు మాత్రం అందరూ ఒకటి అయ్యి తమ ప్రయత్నంగా ఆందోళనలు చేపట్టారు.


ఇప్పటికే రెండు సార్లు కేంద్రానికి తమ వ్యతిరేకత చాటి చెప్పిన కాలీవుడ్ జనాలు మళ్ళీ మూడవసారి దానికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. వినోదపు పన్ను పేరిట భారీ మొత్తాన్ని సినిమాలపై మోపారని, జీఎస్టీని నాలుగు శాతానికి కుదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో కోలీవుడ్ నేడు బంద్ పాటిస్తోంది. నేడు థియేటర్లతో పాటు, సినిమా షూటింగ్ లను కూడా రద్దు చేసినట్టు కోలీవుడ్ చెబుతోంది. 


ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్న దానిమీద గ్యారంటీ లేదు కానీ మరొక పక్క పెద్ద సినిమాల విడుదల కి రంగం సిద్ధమవుతూ ఉండడం కాస్తంత ఇంట్రెస్టింగ్   గా ఉంది. మేర్సాల్ లాంటి అనేక పెద్ద సినిమాలు , హై బడ్జెట్ సినిమాలు విడుదల అవ్వాల్సి ఉన్న ఈ టైం లో ఈ కాలీవుడ్ బంద్ అనేది ఎంత ఇబ్బందికి గురి చేస్తుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: