ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటించిన వారు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు..తర్వాత పెళ్లి చేసుకున్నారు.  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..ఇలా అన్ని ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్నారు.  వీరి బాటలోనే నడిచారు యంగ్ హీరో, హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, సమంత.   అక్కినేని నాగార్జున తనయుడిగా ‘జోష్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నటించారు.
Nagarjuna1
ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. ఎనిమిదేళ్ల ప్రేమబంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురు కుటుంబ పెద్దల ఆశీస్సులతో శుక్రవారం  శుక్రవారం రాత్రి 11.52 గంటలకు గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Samantha3
సంతోషాల పందిరిలో... సన్నిహితుల సమక్షంలో... మంగళ వాయిద్యాలతో... హిందూ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య, సమంతల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.  కాగా శనివారం క్రైస్తవ మతాచార పద్దతిలో సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది.
Most adorable pictures of Chaitanya & Samantha Wedding
ఈ వివాహానికి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర సీమలకు సంబంధించిన ప్రముఖ నటీనటులతో పాటు దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.  శుక్రవారం పెళ్లికి కొన్ని గంటల ముందు నాగచైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున తమ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్‌ చేశారు.
Most adorable pictures of Chaitanya & Samantha Wedding
చైతూ ఒళ్లో కూర్చుని దిగిన ఫొటోను సమంత షేర్‌ చేశారు. వేద మంత్రాలతో ఒక్కటైన చైతూ-సమంతలను  నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఏపీహెరాల్డ్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 

మరిన్ని ఫోటోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @@@ 

http://www.apherald.com/Movies/ViewGalleryPage/284814/Most-adorable-pictures-of-Chaitanya--Samantha-Wedding/1


మరింత సమాచారం తెలుసుకోండి: