ఎంతటి స్టార్ డం ఉన్నా ఇండియా తో పాటు అనేక దేశాలలో తనకి క్రేజ్ ఉన్నా కూడా హీరో రజినీకాంత్ వ్యవహార శైలి సాధారణంగా ఉండనే ఉండదు. ఎప్పుడూ తనదైన శైలి లో జీవితం గడుపుతూ చాలా నిరాడంబరంగా కనిపించే రజినీకాంత్ కి సింపుల్ గా ఉండడం అంటేనే ఇష్టం.

జీవితానికి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే టైం లో హిమాలయాలకి వెళ్ళడం అలవాటు గా చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అతి త్వరలో  మళ్ళీ హిమాలయాలకి వెళ్ళబోతున్నారు అని తెలుస్తోంది.

ఈ మేరకు అంతా సిద్దం చేసుకున్నారు రజిని ఇప్పటికే. రాజకీయాలకి సంబంధించి , కొత్త పార్టీ పెట్టి రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్న రజిని దేవుడి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడిమీద గట్టి నమ్మకంతో ఉన్న రజినీకాంత్ ఎప్పుడూ హిమాలయాలకి వెళ్లి అక్కడి ప్రశాంత వాతావరణం లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

మొన్నామధ్య ఫాన్స్ తో మీటింగ్ పూర్తి అయిన తరవాత కూడా రాజకీయ పార్టీ పెట్టె ఉద్దేశ్యం ఉందా అంటూ మీడియా అడిగిన పక్షం లో దేవుడి ఆదేశం వస్తే తప్పకుండా వస్తా అన్నారు రజిని. ఈ నేపధ్యం లో ఆయన అతి త్వరలో హిమాలయాలకి వెళ్ళబోతున్నారు. హిమాలయాల్లో ధ్యానం చేసి వచ్చిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమిళ రాజకీయాల్లో మారోమారు వేడి మొదలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: