మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న రాజా దీ గ్రేట్ సినిమా మీద సినిమా లవర్స్ లో మంచి హైప్ ఉంది. ఈ సినిమాలో రవితేజ అంధుడు గా కనిపిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం.

కాసేపటి క్రితం తన ట్విట్టర్ పేజీ లో హీరో రవితేజ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసాడు. హీరోయిన్ మెహ్రీన్ జీవితం అగాధం లో ఉన్న టైం లో ఆమెని తరుముతున్న శక్తుల బారి నుంచి కాపాడగల వాడు తన కొడుకు ఒక్కడే అంటూ అలనాటి నటి రాధిక రవితేజ గురించి చెప్పడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

కళ్ళు లేని వ్యక్తి క్యారెక్టర్ లో రవితేజ చాలా అద్భుతంగా చేసాడు.‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు... బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్,

‘నేను పూరీలు వేసుకోవడం లేదురా, ఉరేసుకుంటున్నాను!’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అనడం, ‘చివరగా వచ్చే ఆర్తనాదం వినాలని ఉంది’ అంటూ రవితేజ బదులివ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీ , యాక్షన్ , రొమాన్స్ కలగలిపి ఈ సినిమా లో అనిల్ రావిపూడి వడ్డించాడు అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: