ఈ మద్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది..ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు అభూత కల్పన సృష్టిస్తున్నారు.  ఇక సినిమా ఇండస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఏ ఇండస్ట్రీలో చిన్న విషయం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.   అంతే కాదు కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ లేనిది ఉన్నట్లుగా సృష్టించి ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని  అభ్యంతరకర వ్యాఖ్యలతో  పోస్ట్ లు చేస్తున్న వెబ్ సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోరిన విషయం తెలిసిందే. 
Now it's Movie Artist Associan's turn to fire on websites
ముఖ్యంగా కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానల్స్ తమ రేటింగ్ కోసం ఇష్టమొచ్చినట్లు కవరేజ్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోరారు.   దీనిపై స్పందిచిన పోలీసులు అశ్లీల వెబ్ సైట్లపై ఐటీ యాక్ట్ 67, 67ఏ కిందు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.   ఈ నేపథ్యంలో  హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న వెబ్‌సైట్లపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం.
Image result for cyber crime marfing
మొత్తం 20 వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయా సైట్ల ఐపీ అడ్రస్ ఆధారంగా చర్యలకు రెడీ అయ్యారు. ఇందులో వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్‌ వున్నాయని ప్రస్తావించింది. లైకులు, షేర్లు, పబ్లిసిటీ కోసం బూతులు రాస్తున్నారని, ఆ తరహా పోస్టులు పెడుతున్నారని ఆరోపించింది. విదేశాల నుంచి సైట్లు నడుపుతున్నవారికీ ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు ఇవ్వనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: