పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగించే పవర్ స్టార్ ఫీవర్ ఇప్పుడు క్రికెటర్లకు పాకేసిందని అంటున్నారు. ముఖ్యంగా టీం ఇండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కు పవర్ స్టార్ అంటే ఇష్టమట. అందుకే తన జెర్సీ మీద్ పవర్ స్టార్ అని రాయించుకున్నాడట. 


ఏంటి ఇదంతా నిజమేనా.. యువరాజ్ సింగ్ పవర్ స్టార్ పేరుని టీ షర్ట్ మీద ఉంచుకునేంత అభిమానం ఉందా అంటే ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదు అని తెలుస్తుంది. ఇండియా టీంలో యువరాజ్ బ్యాటింగ్ గురించి తెలిసిందే. ప్రత్యర్ధులకు తన బ్యాట్ తో సమాధానం చెప్పే యువరాజ్ కు ఓ వీరాభిమాని పవర్ స్టార్ అంటూ ఓ టీ షర్ట్ గిఫ్ట్ గా పంపించాడు.


దాన్ని చూపిస్తూ యువరాజ్ దిగిన పిక్ కనబడగానే యువరాజ్ కు పవర్ స్టార్ కు లింక్ పెట్టేశారు. యువరాజ్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానే అంటూ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు యువరాజ్ పవర్ స్టార్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.


ఇక ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ దీవాళికి రిలీజ్ చేస్తారట. 2018 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీళణలో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: