ఏమాయ చేసావే సినిమా ఏ ముహుర్తాన చేశారో కాని అదే చైతు సమంత ప్రేమకు నాంధి పలికింది. ఆ సినిమా హిట్ అవడమే కాదు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో కలిసి నటించి ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నారు.


ఈ నెల 6న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్న చైతన్య సమంత, నిన్న క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకలో చైతు, సమంతలను చూసేందుకు రెడు కళ్లు చాలలేదంటే నమ్మాలంటున్నారు అక్కడ సెలబ్రిటీలు. హిందు సంప్రదాయం ప్రకారం ఫోటోలు నెట్లో హల్ చల్ చేయగా ఇప్పుడు క్రైస్తవ పద్ధతుల్లో పెళ్లిచేసుకున్న సమంత, చైతన్య ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.


ఏమాయ చేసావే సినిమాలో స్క్రీన్ నేం లు అయిన కార్తి-జెస్సీలు పెళ్లిచేసుకున్నారంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అంతేకాదు సిని సెలబ్రిటీస్ కూడా వారి కార్తిక్, జెస్సీల ప్రేమ ఫలించింది అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకలో నాగార్జున, వెంకటేష్ సంగీత్ డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయట.


ముఖ్యంగా బడా నిర్మత సురేష్ బాబు డ్యాన్స్ ఫోటోలు అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సినిమా నిర్మాతగా సురేష్ బాబు ఎంతో రిజర్వ్ గా ఉంటాడు. అలాంటిది మేనళ్లుడు నాగ చైతన్య పెళ్లిలో మాత్రం రెచ్చిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: