తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తాజాగా ఏం మాయ చేశావే చిత్రంతో పరిచయం అయిన అక్కినేని నాగచైతన్య, సమంత షూటింగ్ టైమ్ లో లవ్ లో పడ్డారు.  మనం చిత్రం తర్వాత వీరిద్దరి ప్రేమ గురించి ఇరువురు పెద్దలకు తెలియజేశారు.  పెద్దల అంగీకారంతో  ఈ నెల 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రాండ్ గా జరిగింది.

Sneak peek: Chai-Sam's fairytale-like wedding!

కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. ఈ పెళ్లి సందడి లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బాగా హడావిడి చేశారు.  ఇక నాగార్జున్, వెంకటేష్ లు డ్యాన్స్ చేసి అందరికీ కనువిందు చేశారు.  అఖిల్ అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటూ వదినను ఇంప్రెస్ చేశాడు. 


అయితే  మొన్నటి వరకు తన పేరును ట్విట్టర్ ఎకౌంట్ లో సమంత రూత్ ప్రభుగా ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ తమిళ అమ్మాయి ఇప్పుడు సమంత అక్కినేనిగా మార్చుకొని కంప్లీట్ తెలుగమ్మాయిగా అందరి దీవెనలు అందుకుంటుంది.  మరి కొద్ది రోజులలో నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుండగా, ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: