Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jan 16, 2018 | Last Updated 1:17 pm IST

Menu &Sections

Search

జూనియర్ ఎన్టీఆర్‌ కు కర్ణాటకలో దేవాలయ నిర్మాణం

జూనియర్ ఎన్టీఆర్‌ కు కర్ణాటకలో దేవాలయ నిర్మాణం
జూనియర్ ఎన్టీఆర్‌ కు కర్ణాటకలో దేవాలయ నిర్మాణం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దక్షిణ భారత చలన చిత్ర నటీనటులను ఆరాధించే ప్రేక్షకులు అదే ఫాన్స్ చాలా ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్-వుడ్, ఇలా అన్నీ చిత్రరంగాల్లో హీరో, హీరోయిన్‌లకు ఉన్నంత క్రేజ్ మరే ఇతర రంగానికి చెందిన వారికి ఉండదు. ఈ నటీనటులపై అంత క్రేజ్ పెరగటానికి కారణం వారికి ఉన్న అభిమానజనమే. అభిమానులు ఆరాధించే తీరు ఆ నటీనటు లపై చూపించే ఆరాధన ప్రేమను మాటల్లో వర్ణించలేనంత. ఆ అభిమానానికి సరిహద్దులుండవు. ఒక్కొక్కరూ ఒక్కొక  విధంగా అభిమానిస్తారు, కొందరు తమ అభిమాన నటీనటుల కోసం ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, నయనదానం, ఇలా ఎన్నో సేవలను వారు చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. 


junior-ntr-temple-in-karnatakaసాధారణ అభిమానం భరించవచ్చు కొన్నిసార్లు వారు చూపే అభిమానం ఆ నటీనటులకే భరించ లేనంతగా ఉంటుంది. సరే ఇంత వరకూ బాగానే ఉంది కాని వీరి అభిమానం ఒక్కోసారి "పీక్-స్టేజ్" కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు వారు చేసే పనులు చూసేవాళ్ళకి వింతగా, విచిత్రంగా కనిపిస్తాయి. ఒక్కోసారి ఏకంగా గుళ్లు గోపురాలు కూడా కట్టేసి వారికి పూజలు చేయిస్తుంటారు. ఇలాంటి పిచ్చి లేదా అధిక అభిమానం చూపించే వారిలో "తమిళ అభిమానులు" ఇతర దక్షిణ భారత బాషల వారి కంటే ముందు వరుసలో ఉంటారు.​ 

junior-ntr-temple-in-karnatakaతమిళనాట అందమైన కథానాయికలను అభిమానించడమే కాదు, గుడి గోపురాలు కట్టి అందులో ఆమె విగ్రహాలను దేవతల్లా ఆవిష్కరించి మరీ పూజలు, కుంకుమార్చనలు చేయిస్తూ ఆరాధిస్తారు. గతం లో ఖుష్బూ, నమిత, హన్సిక లకు, తాజాగా కీర్తీ సురేష్ కు కూడా గుడికట్టి తమ విపరీత వెర్రి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే అందమైన కథానాయికలకు గుడికట్టడం పూజించటం వరకూ ఓకే అను కుందాం. బొద్దు అందాలను తమిళులు విపరీతంగా ఆరాధిస్తారని వినటమేకాదు, చూస్తున్నాం కూడా!


junior-ntr-temple-in-karnataka


అయితే ఇప్పుడు ఈ జాడ్యం కథానాయకులకు, అందునా కర్ణాటక రాష్ట్రం లోకి పాకింది. కన్నడ రాష్ట్రం లో ఒక తెలుగు హీరోకి గుడి కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మద్య తెలుగు అద్భుత నటుడు  జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన "జై లవకుశ" సినిమా   కర్ణాటకలో విడుదలై భారీ వసూళ్ళను  సాధించింది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గుల్బర్గా, బళ్లారి, ప్రాంతాల్లో "జై లవకుశ" విడుదలై భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.


జై లవకుశ సినిమాలో  ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన కన్నడిగులు జూనియర్ తారక రాముడుకి గుడి కట్టేందుకు సిద్ధమై పోయారు. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు గుడి కట్టే ప్రయత్నాలు జరుగుతుండగా,  తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జూనియర్ ఎన్టీఆర్‌ దేవాలయం నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం ఆసక్తి కరంగా మారింది.
junior-ntr-temple-in-karnataka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నలుపు లోనే దైవత్వముంది- డార్క్ ఈజ్ డివైన్ ఏ కాన్సెప్ట్- ఒక అద్భుతం
భారతీయ సంతతి మహిళ అమెరికా అధ్యక్షురాలు కానున్నారా!
"అఙ్జాతవాసి" మరో టాలీవుడ్ రికార్డ్ బ్రేక్ -పవన్, మహెష్ తో సినిమాలు తీయటం ప్రమాదమే!
స్పెషల్: సంక్రాంతి ప్రత్యేకత
ఏడిటోరియల్: ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్కాం - అయితే పవన్ కళ్యాణ్ లేదంటే బాలక్రిష్ణ
భారతీయ ఐటి నిపుణులకు శుభవార్త - అమెరికాలో గ్రీన్-కార్డ్ కోటా పెంపు
"నేడు ఆ చిన్నారి శవపేటిక బరువును యావత్ పాకిస్థాన్ మోస్తుంది"
పవన్ కళ్యాణ్ "చరిత్ర"
అజ్ఞాతవాసి బయ్యర్లకు హార్ట్ ఏటాక్ తప్పదా?  నైజాం డిస్ట్రిబ్యూటర్ కు దెబ్బమీదదెబ్బ.
అజ్ఞాతవాసి పై రాం గోపాల్ వర్మ ట్వీట్‌ - పవన్ ఫాన్స్ లో రగులుతున్న అగ్ని
 'అఙ్జాతవాసి' పై విదేశీ చట్టం రూపంలో బాంబ్ పడనుందా?
About the author