తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలు.  ఇండస్ట్రీలో ఈ హీరోలు చక్రం తిప్పుతున్న సమయంలో చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిత్రంతో చిన్న పాత్రలో నటించారు చిరంజీవి.  కానీ, ఆ చిత్రం కంటే ముందు  ప్రాణం ఖరీదు విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. ఇండస్ట్రీలో తన కెరీర్ ని నిలుపుకోవడం కోసం మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత   కొణిదెల శివశంకర వరప్రసాద్ తో కొనసాగడం కష్టం..ఏదైనా కొత్త పేరు మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. అలా అని శివ, శంకర్, ప్రసాద్ పేరు కామన్ అని ఏదైనా కొత్తగా ఆలోచించాలి అన్న అనుకుంటున్న సమయంలో ఓ అద్భుతం జరిగిందట. సాధారణంగా మనకు ఎన్నో కలలు వస్తుంటాయి..కానీ ఏదీ గుర్తు ఉండదు..కానీ ఆరోజు వచ్చిన ఆ కల నాకు జీవితాంతం గుర్తుండి పోయిందని అన్నారు చిరంజీవి. 
Image result for punadi rallu movie
ఇంతకీ ఆ కల ఏమిటా అని అనుకుంటున్నారా..! ఓ రోజు రాముల వారి గర్భగుడి దగ్గర చిరంజీవి సొమ్మసిల్లి పడిపోయాడట..ఆ సమయంలో ఓ అమ్మాయి తన దగ్గరకు వచ్చి..ఏమయ్య చిరంజీవి ఇక్కడ పడుకున్నావ్..బయటికి వెళ్లి పనిచూసుకోపో అని అన్నదట..వెంటనే లేచిన కళ్లు తెరిస్తే..చుట్టూ గుడి వాతావరణం కనిపించిందట..అయినా ఈ అమ్మాయి నన్ను చిరంజీవి అనడం ఏంటీ నేను లేవడం ఏంటీ అని ఆలోచిస్తున్న సమయంలో బయట నుంచి తన స్నేహితుడు కంపౌండ్ వాల్ నుంచి అరే చిరంజీవి రా బయటకు వెళ్తాం అని అన్నాడట.
Image result for chiranjeevi mother
ఆ సమయంలో తాను ఎంతో ఆశ్చర్యపోయానని..తనకు చిరంజీవి పేరు ఉంటుందన్న విషయం కూడా అప్పటి వరకు తెలియదని వీళ్లంతా ఆ పేరు పెట్టి పిలుస్తున్నారేంటీ అనుకుంటూ బయటకు వెళ్లిపోయాను..కల అయిపోయింది అన్నారు.  మరుసటి రోజు మా అమ్మగారితో రాత్రి ఇలా కల వచ్చింది అని చెప్పడంతో..అమ్మగారు నువ్వు సినిమాల్లోకి వెళ్లావు కదా..స్క్రీన్ పేరు గురించి ఆలోచిస్తున్నావు కదా..నువు ఆంజనేయ స్వామి భక్తుడివికి..ఆ స్వామికి చిరంజీవి అని పేరు ఉంది..ఆ పేరు ఎంతో పవిత్రమైనది.
Related image
బహుషా ఆ స్వామి సూచించిన పేరు అయి ఉండవచ్చు అని అన్నారు. స్వతహాగా నేను ఆంజనేయ స్వామి భక్తున్ని..దైవాన్ని నమ్మే నేను ఆ భగవంతుడే ఆ పేరు పెట్టాడని భావించి అప్పటి నుంచి  కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరుని చిరంజీవిగా మార్చుకున్నానని అన్నారు.  అదండీ..మెగాస్టార్ చిరంజీవి పేరు వెనుక అసలైన కథ. 


మరింత సమాచారం తెలుసుకోండి: