మారుతి మరో సారి బూతు సినిమాని జనం మీదికి వదులుతున్నాడా ? డబుల్ మీనింగ్, సెక్స్ విచ్చల విడిగా తన సినిమాలో కూరాడా?  రొమాన్స్ సినిమా సెన్సార్ కట్స్ చుస్తే అవును అనే అనిపిస్తుంది.  ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

మారుతి సినిమా కదా...?  ఏ సర్టిఫికేట్ కామనే. అయితే ఈ సినిమాలో 70 చోట్ల సెన్సార్ కట్స్ చెప్పిందట. కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం చెప్పిందట. వాటిని తొలగించారు. చాల చోట్ల బ్లర్, బీప్ లకు పని కల్పించారు. దీనిని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో వుందో ఊహించుకోండి.

ఓ సెన్సార్ సభ్యుడు ఈ సినిమా బస్ స్టాప్ సినిమాకి బాబులా వుంది అన్నాడట. అది ఇంకా పరాకాష్ట. మొత్తం మీద మారుతి బూతు తప్ప మరో సినిమా తీయలేడు  అనే సంగతి ఈ సినిమా మరో సారి రుజువు చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: