సినిమా పరిశ్రమలో ఒక నటిగా ఒక కథానాయికగా నిలబడాలంటే ఎన్నో లైంగిక వేదింపులకు ధారుణమైన వత్తిళ్ళకు గురికావటం తప్పట్లేదని కొన్నిసార్లు లొంగిపోవాల్సి వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా నటీమణులు బయటపడి బాహ్యంగానే చెప్పేస్తున్నారు. 

చిత్ర పరిశ్రమలోని చాలా మంది నటీమణులు చాలా బోల్డ్-గా,  ధైర్యంగా, బహిరంగానే  చెప్పేస్తున్నారు. ఇక్కడ మేము ధారుణ వేధింపులను ఎదుర్కొన్నాం, అనే విష యాన్ని చాలా మంది నటీమణులే చెబుతున్నారు. హీరోల నుంచి, నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి అనేక లైంగిక వేధింపులు తమకు తప్పలేదని వారు కుండ బద్ధలు కొడుతున్నారు.




హీరోలు తమను పడకింటికి, పక్కలోకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, నిర్మాతలూ, దర్శకులు అలాంటి లైంగిక ఒత్తిళ్లు తెస్తున్నారని, వారు చెబుతున్నారు. కొంత మంది ప్రత్యక్షంగా వారి పేర్లనే చెబుతుంటే, మరి కొందరు పరోక్షంగా తాము ఎదుర్కొన్న దురదృష్టకర అనుభవాల గురించి చెపుతున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ ప్రఖ్యాత విద్యాబాలన్ కూడా తన అనుభవంలో తాను ఎదుర్కొన్న అలాంటి విషయాన్ని వివరించింది. చిత్ర పరిశ్రమలో తన పైనా అనేక లైంగిక ఒత్తిళ్లు వచ్చాయని - తనకూ తప్పలేదని విద్యాబాలన్ పరోక్షంగానే అయినా తేటతెల్లం చేసి తేల్చి చెప్పింది. అయితే వాటిని తిప్పికొట్టాను అని, వాటి బారిన పడ కుండా తనను తాను కాపాడుకున్నానని విద్యాబాలన్ వివహరించింది. దానికి తనకు "తన మధ్యతరగతి మనస్తత్వమే" సాయపడిందని విద్యాబాలన్ వివరించింది.

Image result for most beautiful erotic images of vidyabalan

జాతీయ అవార్డు గ్రహీత, అత్యుత్తమ నటి,  కథానాయకి అయిన విద్యాబాలన్ చిత్ర పరిశ్రమలో నటీమణులను పక్కలోకి తెచ్చుకొని వాడుకోవాలని చూసే తత్వం ఉందని నిస్సందేహంగానే,  ధ్రువీకరించింది. అయితే తను మాత్రం వాటి బారిన పడలేదని, అలాంటి ఒత్తిళ్లు ఎదురవుతాయని అనిపించిన సమయంలో తనే వాటికి దూరంగా జరిగానని విద్యాబాలన్ వ్యాఖ్యానించింది. తనకు పడని వాతారణానికి తానెప్పుడూ దూరంగా వెళ్లి పోయాను అని, దీంతో వేధింపులు తన దరి చేరలేక పోయాయని విద్యాబాలన్ వివరించింది. ఈ జాతీయ ఉత్తమనటి కూడా చిత్ర పరిశ్రమకు  "క్లీన్‌చిట్" ఇవ్వలేదనేది మాత్రం
సుస్పష్టం అవుతోంది.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: