తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన చిత్రం రోబో.  శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతాలు సృష్టించింది.  ఆ తర్వాత అదే రేంజ్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో సీక్వెల్ రోబో 2.0 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 
Image result for robo 2.0 posters
ఈ మద్య దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు డైరెక్టర్ శంకర్. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటి అమీ జాక్సన్ నటిస్తుంది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఈ సినిమాల ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 
Image result for robo 2.0 posters
ఇప్పటికే 'డాక్ట‌ర్ రిచ‌ర్డ్స్' పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ లుక్‌, గెట‌ప్ గురించి పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసినా... ఈ పోస్ట‌ర్‌లో అక్ష‌య్ ప‌లికించిన హావ‌భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోబో 2.0' విడుద‌ల తేదీ మీద స్ప‌ష్ట‌త ఇంకా రాక‌పోయినా, చిత్ర బృందం విడుద‌ల చేస్తున్న పోస్ట‌ర్లు మాత్రం అభిమానుల్లో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో అక్ష‌య్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూపించా‌డన‌డానికి ఈ ఒక్క పోస్ట‌ర్ చాల‌ని అభిమానులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: