హీరో రాజశేఖర్ - డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెలుగు సినిమా చరిత్ర కే ఒక వండర్ ని అందించారు . గరుడ వేగ అంటూ సాగిన ఈ చిత్రం నిన్న థియేటర్ లలో విడుదల అయింది, ట్రైలర్ చూసి థియేటర్ లలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరికీ యాక్షన్ సీక్వెన్స్ లతో కడుపునిండా ఫుడ్ పెట్టాడు డైరెక్టర్.

అయితే ఇలాంటి సినిమాల నుంచి రాజశేఖర్ నేర్చుకోవాల్సిన దానికంటే ఇతర తెలుగు హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సేఫ్ జోన్ లో ఉండడమే పరమావధి గా సాగుతూ ఉంటారు మన హీరోలు .. దాని కోసం పేలవమైన స్క్రిప్ట్ లు ఎంచుకోవడం పప్పులో కాలు వెయ్యడం చేస్తుంటారు.

ప్రయోగాల పేరుతో పక్క రాష్ట్రం డైరెక్టర్ లకి తమని తాము అప్ప జెప్పెస్తారు కొందరు హీరోలు .. మరి కొందరు రీమేక్ లే శరణ్యం అంటూ కాలం గడుపుతూ ఉంటారు. హీరోయిజం మీద బతికేసే హీరోలు మరికొందరు .. ఇదే రాజశేఖర్ ని తమ సినిమాల్లో ఇమిటేట్ చేసి ఏడిపించిన హీరోలకి ఇలాంటి స్క్రిప్ట్ లు చేసే దమ్ముందా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: