కింగ్ నాగార్జున ప్రొడక్షన్ లో సినిమా అంటే దాదాపు ఆయన చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. ముప్పై ఏళ్ల అనుభవంతో నాగార్జున చెప్పిన విషయాలు కచ్చితంగా సినిమాకు హెల్ప్ అవుతాయి. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి మనం సినిమా ఇచ్చిన విక్రం కుమార్ కు నాగార్జున సలహా ఇస్తున్నాడట. అయితే నాగ్ మాటలను విక్రం వినిపించుకోవత్లేదు అన్నది లేటెస్ట్ టాక్.


అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న హలో సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ కోసం 40 కోట్ల దాకా ఖర్చు పెడుతున్న నాగ్ సినిమా రిలీజ్ విషయంలో విక్రంతో గొడవపడుతున్నాడట. ఆల్రెడీ సినిమా చివరి దశకు చేరుకోగా డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేశాడు నాగార్జున. 


సంక్రాంతి రేసులో ఇప్పటికే అదిరిపోయే పోటీ ఉండగా ఆ తర్వాత అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అని.. నాగార్జున హలోని డిసెంబర్ లోనే తీసుకురావాలని చూస్తున్నాడట. కాని విక్రం మాత్రం సినిమా త్వరగా ఫినిష్ చేస్తే క్వాలిటీ దెబ్బతింటుందని వాదిస్తున్నాడట. ఈ విషయంపై నాగార్జున విక్రం గొడవపడుతున్నాడట.


నిర్మాతగా తన మాట నెగ్గించుకునేందుకే నాగ్ హలో విక్రం చెప్పింది మాత్రం చెయ్యమని అంటున్నాడట. కచ్చితంగా హలో డిసెంబర్ లో వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. లాస్ట్ మినిట్ లో సారీ అనేసినా అనేస్తారు. అఖిల్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ అక్కినేని కుర్రాడు హలోతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: