టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు..పాత తరం నటీమణులు కేవలం గ్లామర్ కే ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు.  అయితే ఈ తరం హీరోయిన్లు మాత్రం నటనకు తక్కువ గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.



కేవలం గ్లామర్ తరహా పాత్రలే కాకుండా నటిగా తనను తాను ప్రూఫ్ చేసుకునే పాత్రలు.. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ఎపిక్స్ మూవీలో నటించి తనలోని సత్తాని నిరూపించుకుంది.   అనుష్క త్వరలో భాగమతి అనే ఉమెన్ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.  


యూవీ క్రియేషన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తుండగా, గ్రాఫిక్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. స్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.   రేపు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా  ‘భాగమతి’ ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది.  ఫస్ట్ లుక్ లో అనుష్క చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ఓ చేత్తో సుత్తి పట్టుకుని మరో చేతికి మొలతో కిట్టినట్లు కనిపిస్తుంది.  మొత్తానికి ఫస్ట్ లుక్ లో మాత్రం కాస్త భయం కొలిపేలా కనిపిస్తుంది. 


విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్ బేనర్ పై వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేయనున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: