Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jan 16, 2018 | Last Updated 1:13 pm IST

Menu &Sections

Search

బాగమతి బర్త్-డే కి బాహుబలి బహుమతి?

బాగమతి బర్త్-డే కి బాహుబలి బహుమతి?
బాగమతి బర్త్-డే కి బాహుబలి బహుమతి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి సూపర్ స్టార్ ప్రభాస్‌, స్వీటీ అనుష్క షెట్టి ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలం నుంది మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఒక ప్రముఖ మీడియా వ్యక్తి ఇద్దరి మద్య ప్రేమ ఉందని, ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

sweety-anushka-shetty-happy-birth-day


కాని ఆ వార్తలను ప్రభాస్‌, అనుష్కలు మరియు సన్నిహితులు కొట్టి పారేశారు. మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తున్నా కూడా వారిద్దరి మద్య ఉన్న సన్నిహిత్యంను చూస్తుంటే ఇద్దరు చాలా ఘాడమైన ప్రేమలో ఉన్నట్లుగా అర్ధమౌతుంది. 
ఇటీవల ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా అనుష్క చాలా ఖరీదైన డిజైనర్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రత్యేకంగా రెడీ చేయించిన వాచ్‌ తో ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. 

sweety-anushka-shetty-happy-birth-day

తాజాగా అనుష్క పుట్టిన రోజు జరుపుకుంది. ఆమె ఖరీదైన వాచ్‌ ను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు ప్రభాస్‌ - అనుష్క ఇచ్చిన గిఫ్ట్‌ కంటే చాలా విలువైన బహుమతి ఇచ్చాడు. ప్రముఖ కంపెనీ (BMW) కారును అనుష్క కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి ప్రభాస్‌ అనుష్కకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగిందట. ఇద్దరు ఇంత ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చుకుంటు, ఒకరికి ఒకరుగా ఉంటూ ఇద్దరి మద్య ప్రేమ లేదంటే ఎలా నమ్ముతాం అంటున్నారు వారి అభిమానులు. ఇద్దరి మద్య ప్రేమ ఉంది, ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో వీరి వివాహం జరుగబోతుంది. ఈ విషయం లో ఎలాంటి అనుమానం లేదు అంటూ సినీ వర్గాల వారు బల్ల గుద్ది మరీ చెపుతున్నారు. 

**********************************************************************************************************

దక్షిణభారత చిత్రసీమకు ప్రత్యేకించి తెలుగు సినిమారంగానికి ఆణిముత్యంలా దొరికింది నిలువెత్తు రాజసం ఉట్టిపడే సౌందర్యం అనుష్కా శెట్టి. ఒక మహారాణి పాత్రలో గాని అలాగే ఒక రాజకుమారి పాత్రలోగాని ఒక గ్లాం-గర్ల్ పాత్రలో గాని అట్టే ఇమిడిపోయి నటించగల చాతుర్యం ఆమెస్వంతం. 2005 లో సూపర్ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన ఈమె ఒక కథా నాయకిగా నటిగా ఒక పుష్కర కాలం పూర్తి చేసి, దాదాపు 40 సినిమాల్లో ముఖ్యంగా దక్షినాదిన అత్యధిక అభిమానులు కలిగిన కథానాయకిగా తన ముగ్ధ మనోహర సౌందర్యం తో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టి  పేరు ప్రతిష్టలు పొందింది. 

sweety-anushka-shetty-happy-birth-day

ముఖ్యంగా బాహుబలి లో దేవసేన పాత్రలో 'ఒక ప్రక్క డి-గ్లామర్ యాంగిల్లో ఎంత ప్రసంసలు కురిపించిందో సౌందర్య రసాధిదేవత దేవసేనగా ముగ్ధ మనొహర శృంగారం కురిపించింది'  ఒక ప్రక్కకళ్లలో నిప్పులు కురిపించిన యువరాణిగా -శివగామి రమ్యకృష్ణతో పోటీబడి నటించి ఆసేతు శీతాచలం ప్రేక్షకులను మరోలోకానికి తీసుకెళ్ళింది. 

sweety-anushka-shetty-happy-birth-day
    
బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిల పరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి  అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.

sweety-anushka-shetty-happy-birth-day

సముద్ర తీరనగరం అందగత్తెల జన్మస్థలం మంగుళూరులో పుట్టిన స్వీటీ పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న "మౌంట్ కార్మెల్ కళాశాల" నుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ తనకు లేదని, తను అత్యంత అభి మానం పెంచుకున్న ప్రవృత్తి ఫిట్‌ నెస్ రంగంలోనే పనిచెయ్యాలనేది ఈమె కోరిక. ఈమె యోగా చెయ్యటమే కాకుండా యోగ శిక్షణలో కూడా నైపుణ్యం కలిగిఉంది. ఈమె గురువు భూమికాచావ్లాను భర్త ప్రఖ్యాత యోగానిపుణుడు భరత్ ఠాకూర్. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు. ఒక దక్షిణ భారత నటి ఒకేఒక్క సినిమాతో భారత దేశాన్నే కాదు ప్రపంచాన్న్నే ఉర్రూతలూగించటం ఈ తరంలో మరొకలికి అనితర సాధ్యం.

sweety-anushka-shetty-happy-birth-day

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన "అరుంధతి" సినిమా ఈమె సినీ జీవితం లో ఒక మైలు రాయిగా నిలిచి ఈమెను ఒక విఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అప్పటికి ఈ ఫీట్ సాధించటం కొందరు అగ్రనటులకే సాధ్యంకాలేదు. అందులో 10కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందు కున్నది. అనుష్క సినిమా రంగం లో చేరిన తొలినాళ్ళలోనే తన అంతరాంతరాల్లో దాగిఉన్న లోని నటిని ఆవిష్కరించింది. 

sweety-anushka-shetty-happy-birth-day

2018 సంక్రాంతి సీజన్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహ’ తో పోటీకి దిగుతుండగా స్టార్ హీరోయిన్అనుష్క కూడా తన తర్వాతి సినిమా ‘భాగమతి’ తో ఈ బరిలో నిలవబోతున్నట్లు తెలు స్తోంది. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ నాటికల్లా పూర్తి సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని తెలి సింది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ నుండి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.అలాగే సంక్రాంతికి రవితేజ ‘టచ్ చేసి చూడు’ కూడా విడుదల కానుంది అంటున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్య పోటీకి సిద్ధమవుతుండటంతో ‘భాగమతి’ ఏ స్థాయిలో వుంటుందో చూడాల నే ఆసక్తి ఎక్కువవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండనున్నాయి. పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటున్న చిత్రంలో ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌లు కూడా పలు కీలక పాత్రలు చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి.

sweety-anushka-shetty-happy-birth-day

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క శెట్టి నటిస్తున్న తాజాతెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్-లుక్ ను చిత్రయూనిట్ నిన్న (నవంబర్ 6న) సాయంత్రం విడుదల చేసింది.

sweety-anushka-shetty-happy-birth-day

ఈ ఫస్ట్-లుక్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరతాయి. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. బంపర్ హిట్ చిత్రాల్ని నిర్మించి, రెబల్ స్టార్ ప్రభాస్ తో నాలుగు భాషల్లో సాహో వంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. మాథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు ప్రమోద్, వంశీ తెలియజేశారు.

sweety-anushka-shetty-happy-birth-day

ఈ జన్మదిన శుభకాంక్షలతో బాహుబలి ప్రభాస్ తన దేవసేన ఉరఫ్ భాగమతి అనుష్కకు ఏ బహుమతి ఇస్తాడో అని సంభ్రమం తో ఈ ఇద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఏపి హెరాల్డ్ తరపున అనుష్క కు జన్మదిన శుభాకాంక్షలు 

sweety-anushka-shetty-happy-birth-day
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నలుపు లోనే దైవత్వముంది- డార్క్ ఈజ్ డివైన్ ఏ కాన్సెప్ట్- ఒక అద్భుతం
భారతీయ సంతతి మహిళ అమెరికా అధ్యక్షురాలు కానున్నారా!
"అఙ్జాతవాసి" మరో టాలీవుడ్ రికార్డ్ బ్రేక్ -పవన్, మహెష్ తో సినిమాలు తీయటం ప్రమాదమే!
స్పెషల్: సంక్రాంతి ప్రత్యేకత
ఏడిటోరియల్: ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్కాం - అయితే పవన్ కళ్యాణ్ లేదంటే బాలక్రిష్ణ
భారతీయ ఐటి నిపుణులకు శుభవార్త - అమెరికాలో గ్రీన్-కార్డ్ కోటా పెంపు
"నేడు ఆ చిన్నారి శవపేటిక బరువును యావత్ పాకిస్థాన్ మోస్తుంది"
పవన్ కళ్యాణ్ "చరిత్ర"
అజ్ఞాతవాసి బయ్యర్లకు హార్ట్ ఏటాక్ తప్పదా?  నైజాం డిస్ట్రిబ్యూటర్ కు దెబ్బమీదదెబ్బ.
అజ్ఞాతవాసి పై రాం గోపాల్ వర్మ ట్వీట్‌ - పవన్ ఫాన్స్ లో రగులుతున్న అగ్ని
 'అఙ్జాతవాసి' పై విదేశీ చట్టం రూపంలో బాంబ్ పడనుందా?
About the author