ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అదృష్టం కలిసి వచ్చి ఒక్కసారే స్టారో హోదాలోకి వెళ్తున్నారు. చిన్ని సినిమాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఒక్కసారే పెద్ద బ్యానర్ లో నటించే అవకాశం దక్కించుకుంటారు.  ఇదే కోవలోకి వస్తారు విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు తర్వాత అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ అందుకున్న మనోడికి వెంటన సినిమా చాన్సులు వస్తున్నాయి. ఈ మద్య ‘గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ప్రవీణ్ సత్తారుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి
Image result for garuda vega
 గతంలో మనోడు తీసిన సినిమాలు పెద్దగా ఆదరణ లేకపోయినా.. ‘గరుడవేగ’ చిత్రంతో బాక్సాఫీస్ మంచి కలెక్షన్లు వసూళ్లు చేస్తున్నాడు. ‘గరుడవేగ’ చిత్రంతో తనలో ఉన్న ప్రతిభ ఏంటో టాలీవుడ్‌కి రుచిచూపాడు. దీంతో టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోల చూపు ఈ దర్శకుడిపై పడింది. కొత్త దర్శకులకు మంచి ప్రోత్సాహం ఇచ్చే హీరో నితిన్ ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు.
Image result for nithin
శ్రేష్ఠ్ మూవీష్ బ్యానర్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు పాటు.. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీతో పాటు ‘గరుడవేగ పార్ట్-2’ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉండటంతో నితిన్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చే సినిమా కాస్త టైమ్ పట్టొచ్చు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: