తెలుగు ఇండస్ట్రీలోకి చాలా కాలం తర్వత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇచ్చారు యాంగ్రీమాన్ డాక్టర్ రాజశేఖర్.  గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతూ సినిమాలకు దూరంగా ఉంటూ  సరైన హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు రాజశేఖర్. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్ంలో వచ్చిన ‘గరుడ వేగ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Image result for garuda vega stills
ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అలా తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ లో ఈ సినిమా టీమ్ పాల్గొంది. వాళ్లతో పాటు ఈవెంట్ లో సునీల్ కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కామెడీ హీరో సునీల్ మాట్లాడుతూ..'గరుడవేగ' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్ కి అభినందనలు తెలియజేశాడు. 
Image result for garuda vega posters
హీరో రాజశేఖర్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నాకు హీరో లాంటి వారని అన్నారు. అందుకే  రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఒక హీరోగానే కాదు మనసున్న మనిషిగా ఆయనని ఇష్టపడతానని చెప్పాడు. ఆ మద్య తన కూతురు కి చాలా సీరియస్ గా ఉంటే వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు' అన్నాడు. రాజశేఖర్ టీమ్ తో కలిసి క్రిస్ మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: