భారత దేశ చలన చిత్ర రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ రూ.450 కోట్ల నిర్మాణంతో తెరకెక్కబోతుంది రోబో 2.0.  గతంలో భారత్ లోనే కాదు ప్రపంచ దేశాల్లో సంచలన సృష్టించిన రోబో కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.   గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ప్రతిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన 'రోబో 2.0' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  ఇక  'రోబో 2.0' చిత్రంలో కూడా విల‌న్‌గా చేసిన అక్ష‌య్ కుమార్, 12 విభిన్న వేష‌ధార‌ణ‌ల్లో క‌నిపించ‌నున్నట్లు ఇండస్ట్రీ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి.
Image result for robo 2.0 posters
శంక‌ర్ సినిమాల్లో హీరోల గెట‌ప్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా హీరోల వేష‌ధార‌ణ మార్చ‌డం శంక‌ర్‌కి బాగా అల‌వాటు.  'డాక్ట‌ర్ రిచ‌ర్డ్స్' అనే పిచ్చి శాస్త్ర‌వేత్త పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సినిమాకు సంబంధించి మ‌రో కొత్త పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేసి సినిమా మీద అంచనాలను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నిర్మాత‌లు.
Image result for robo 2.0 posters
పోస్టర్ చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.  నాలుగు చేతివేళ్ల‌ను మాత్ర‌మే చూపిస్తూ..వాటి వెన‌కాల క‌న్నును పోలిన ఆకారం ఉంది. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సమాచారం. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15 భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: