సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రిలీజ్ అయిన ప్రతి సినిమా గురించి ఏదో ఒక విధంగా తన స్పందన తెలియచేస్తాడు. ఫలానా సినిమా ఇలా ఉంది.. ఆ సినిమాలో హీరో ఈ స్టార్ కన్నా నయం అంటూ వెక్కిరింపు కామెంట్లు చాలానే చేస్తాడు. అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న రాజశేఖర్ గరుడవేగపై వర్మ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అన్నది ప్రస్తుతం హాట్ న్యూస్.  


తనకు నచ్చిన సినిమా నచ్చని సినిమా రెండిటిలో తన అభిప్రాయాన్ని కుడబద్ధలు కొట్టినట్టు చెప్పే ఆర్జివి గరుడవేగ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అన్నది అర్ధం కాని విషయం. అయితే దీనికి రాజశేఖర్ వర్మల మధ్య ఉన్న గొడవలే కారణం అని అంటున్నారు కొందరు. 


రాజశేఖర్ తో వర్మ తీసిన పట్టపగలు సినిమా రిలీజ్ కే నోచుకోలేదు. సినిమా అనుకున్నది ఒకటి చేసింది ఒకటని.. అసలు సినిమా సగంలోనే అందరు చేతులెత్తేశారట. ఫైనల్ గా ఎలాగోలా పూర్తయితే చేశారు కాని అది రిలీజ్ చేసేందుకు ఎవరు సాహసించలేదు. అలా తన సినిమాకు సహకరించని రాజశేఖర్ సినిమాకు తాను ఎందుకు పబ్లిసిటీ చేయాలని వర్మ డిసైడ్ అయినట్టు ఉన్నాడు.


అందుకే గరుడవేగ గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతున్నా వర్మ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. అఫ్కోర్స్ రాజశేఖర్ స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా వర్మ ఈ విషయంలో వెనక్కి తగ్గడం తనకి పగ ప్రతీకారాలు ఉంటాయని అనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: