తెలుగు ఇండస్ట్రీలో బొమ్మరిల్లు చిత్రంతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్ చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన హరర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘గృహం’ ఇటీవల తమిళ్‌లో విడుదలైన విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం నవంబర్ 10న తెలుగులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించనప్పటికీ థియేటర్స్ సమస్య తలెత్తడంతో మరోసారి వాయిదా పడింది ‘గృహం’. 
Image result for gruham telugu movies
వాస్తవానికి ఈ చిత్రం 3 న రిలీజ్ చేయాలని చూశారు..కానీ ఆ రోజు మూడు సినిమాలు పోటీ ఉండటంతో సినిమా కాస్త 10 కి వాయిదా వేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ డేట్ కూడా వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాననీ, ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. 

Image result for gruham telugu movies

ఆ మద్య తెలుగులో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలు నిరాశ పరచడంతో చివరిగా సంథింగ్ సంథింగ్ అంటూ అభిమానుల ముందుకు వచ్చాడు. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 3న హిందీ,  తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ కొని అనివార్య కారణాలవల్ల నవంబర్ 10కి వాయిదా వేశారు. కాగా ప్రస్తుతం మరోసారి ఈ మూవీ వాయిదా పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: