టాలీవుడ్ లో ఈ మద్య మెగాస్టార్ ఇంట్లో చోరీ విషయం పలు సంచలనాలు సృష్టించింది. గత కొంత కాలంగా నమ్మకంగా ఉంటూ వచ్చిన ఇంటి పనిమనిషి చెన్నయ్య డబ్బు తీసుకొని ఉడాయించాడు.  మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రూ. 2 లక్షల నగదు చోరీ అయినట్లు చిరు మేనేజర్ గంగాధర్ నిన్న పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Image result for chiranjeevi robber server Chennayya
దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 25లోని చిరంజీవి ఇంట్లో చెన్నయ్య అనే వ్యక్తి గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు.

ఆయన ఇంటి ఆవరణలో ఉండే అడ్మినిస్ట్రేట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తుంటాడు. కాగా, ఇటీవల ఆఫీసు ఖర్చుల నిమిత్తం మేనేజర్ గంగాధర్ రావు రూ. 4 లక్షలు తెచ్చి టేబుల్ సొరుగులో ఉంచి, సాయంత్రం చూడగా, రూ. 2 లక్షలు మాయం అయ్యాయి.
Image result for chiranjeevi robber server Chennayya
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చెన్నయ్యను అరెస్ట్ చేసి, అతన్నుంచి రూ. 1.50 లక్షలు రికవరీ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఆపై రిమాండ్ కు తరలించారు. మిగతా రూ. 50 వేలతో అతను జల్సాలు చేశాడని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: