ఈ ఏడాది విడుదల అయిన సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమాని తీసిన తీరు, విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డిగా చేసిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మనం ఎవ్వరం మర్చిపోలేని తీరులో ఉంటుంది.

అతని తదుపరి చిత్రం కోసం ఇంకా ఎలాంటి ఏర్పాట్లూ జరగలేదు. అయితే అతని నెక్స్ట్ సినిమా కథ తనకి తెలుసు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని రీసెంట్ గా కలిసాను అని రామ్ గోపాల్ వర్మ ఒక ఫోటో పెట్టి వివరించారు.

ఫేస్ బుక్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో రామూ ఈ ఫోటో ని ఉంచారు.  అతను తన తదుపరి సినిమా కథను వివరించాడని, అది విన్న తరువాత తాను అసూయతో రగిలిపోయానని అన్నాడు.

సందీప్ చెప్పిన కథతో తీసే సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని, అంతటి మెగా విజయాన్ని ఆయన తదుపరి చిత్రం సొంతం చేసుకుంటుందని అన్నాడు. సందీప్ రెడ్డి రెండో సినిమా కూడా హిట్ కొట్టి తీరతాడు అన్నారు రామూ.


మరింత సమాచారం తెలుసుకోండి: